హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పనుల పరిశీలన

NGKL: నాగర్‌కర్నూల్ పట్టణ కేంద్రంలో రూ.9 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన పనులను మున్సిపల్‌ ఛైర్మన్‌ తీగల సునేంద్ర కుమార్‌ పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. భవనం అందుబాటులోకి వస్తే విద్యార్థులకు మెరుగైన వసతులు, అందనున్నాయి.