హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కరెంటు కోసం రైతుల ధర్నా

WNP: వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదంటూ కడుకుంట్ల సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. 12 గంటల కరెంటు హామీ ఇచ్చినా 6 గంటలు కూడా సక్రమంగా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే విద్యుత్ సరఫరా మెరుగుపరచాలని కోరారు. నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్, డీఈ శ్రీనివాసులు హామీ ఇచ్చారు.