హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల ఘర్షణ.. వీడియో వైరల్

HYD: సంతోష్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థుల మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. సుమారు 10 మంది విద్యార్థులు ఓ విద్యార్థిపై దాడి చేస్తున్న దృశ్యాలను స్థానికులు రికార్డు చేశారు. ఘటనపై ఐఎస్‌ సదన్ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు సమాచారం. తరచూ విద్యార్థుల మధ్య ఘర్షణలు జరుగుతుండటంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.