హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల ఫోకస్

TPT: చంద్రగిరి సీఐ, తహసీల్దార్, ఎంపీడీఓ, ఏఈ (ఇరిగేషన్) అధికారులు కలిసి చంద్రగిరి మండలంలోని వినాయక విగ్రహాల నిమజ్జన ప్రదేశాలను పరిశీలించారు. నిమజ్జన ప్రాంతాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నీటి సదుపాయాలు, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక వసతులపై సంబంధిత అధికారులతో చర్చించి, అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.