హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూరగాయల సాగులో జిల్లా వెనుకంజ

VKB: జిల్లాలో కూరగాయల సాగు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఈ ఏడాది 25,978 ఎకరాల్లో కూరగాయలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 9,989 ఎకరాల్లోనే సాగు జరిగింది. లక్ష్యంలో 34.44 శాతం మాత్రమే పూర్తయింది. సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో అత్యధికంగా తాండూరులో టమాటా సాగు జరుగుతోంది.