హైదరాబాద్: 28°C
తెలంగాణ

పటాన్చెరులో ముందుగానే వినాయక చవితి సందడి

SRD: పటాన్చెరు పట్టణంలో వినాయక చవితి సందడి ముందుగానే మొదలైంది. గణేష్ మండపాల్లో కొలువుదీరేందుకు సిద్ధమైన గణనాథుల విగ్రహాల విక్రయాలు జోరందుకున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట వివిధ ఆకృతులు, పరిమాణాల్లో ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. దీంతో పటాన్చెరు పరిధిలో పండగ వాతావరణం నెలకొంది.