హైదరాబాద్: 28°C
తెలంగాణ

SGF పోటీల్లో ప్రతిభ చాటుతున్న విద్యార్థినులు

JGL: కథలాపూర్(M) కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో గురువారం SGF మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. అండర్-17 బాలికల విభాగంలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలను ఎంఈవో లోకిని శ్రీనివాస్, ఇంఛార్జ్ హెచ్‌ఎం వెంకటేశం ప్రారంభించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో SGF కన్వీనర్ వాసం నవీన్ పాల్గొన్నారు.