హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సాయుధ పోరాట నిప్పురవ్వ ఐలమ్మ'

SRPT: కోదాడ పట్టణంలో సీపీఎం ఆధ్వర్యంలో ఇవాళ చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ములకలపల్లి రాములు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దొరలు, భూస్వాములను ఎదిరించి పేదల హక్కుల కోసం ఐలమ్మ సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు.