హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలను సడలించాలి'

NLG: ఇందిరమ్మ ఇళ్లపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో ఇవాళ మాట్లాడారు. ఆటోలు, ట్రాక్టర్లు ఉన్నాయనే చిన్న కారణంతో నిజమైన పేదలకు ఇళ్లు రాలేదని, నిబంధనలు సడలించాలని కోరారు. పెరిగిన ధరల దృష్ట్యా ఇంటి నిర్మాణ నిధులను పెంచాలని, స్థలం లేని నిరుపేదలకు స్థలాలిచ్చి ఇళ్లు కట్టించాలని విజ్ఞప్తి చేశారు.