NZB: సిరికొండ మండలం చిన్నవాల్గోట్ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ గణేష్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. భూమి కోసం పోరాడిన ధైర్యశాలి ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన కమిటీ ప్రధాన కార్యదర్శి బండి నరేష్, కొండూరు రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఐలమ్మకు ఘన నివాళి


