హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం!

NLR: వరికుంటపాడు మండలం విరువూరు పంచాయతీ పరిధిలోని మారుతీ నగర్ దగ్గర ఒక విద్యుత్ స్తంభాన్ని పిచ్చి మొక్కలు కప్పి వేసాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. వర్షాల సమయంలో ఉష్ణోగ్రతలు పెరిగితే అగ్నిప్రమాదం జరిగి విద్యుత్ తీగలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. పిచ్చి మొక్కలు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.