హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్‌పై కాంగ్రెస్ పోలీసులకు ఫిర్యాదు

HNK: మాజీ సీఎం కేసీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరూరి సాంబయ్య, కాంగ్రెస్ నాయకులు కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ నిర్వహించిన ‘సావు డబ్బు’ కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్ నాయకులు శుద్ధి చేయడంపై కూడా చర్యలు తీసుకోవాలని సీఐ శ్యామ్‌సుందర్‌కు వినతిపత్రం అందజేశారు.