హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

RR: RTC బస్సు బీభత్సం సృష్టించిన ఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిధిలో చోటుచేసుకుంది. బైక్‌ను తప్పించబోయి నియంత్రణ కోల్పోయిన ఆర్టీసీ బస్సు బాటసింగారంలోని ఓ పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. రెండు కార్లు, ఆటోను ఢీ కొట్టింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.