హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు

MHBD: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలను జిల్లా వైద్యాధికారి రవి రాథోడ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, స్కానింగ్ కేంద్రాల నిర్వహణ, వైద్య శాఖ నిబంధనల అమలును పరిశీలించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.