హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం'

KMR: బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం చిరస్మరణీయం అని KMR అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి అన్నారు. నేడు తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.