JGL: కోరుట్లలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని ప్రారంభానికి కావాల్సిన పనులను తక్షణమే పూర్తి చేయాలన్నారు.
తెలంగాణ
'ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి'


