హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పారిశ్రామిక పార్కు భూసేకరణపై అపోహలు వద్దు'

ADB: భోరజ్ మండలంలో పారిశ్రామిక పార్కు కోసం 2,062.01 ఎకరాలు సేకరిస్తుండగా.. ఇందులో ఈడీ అటాచ్ చేసిన భూములు 500 ఎకరాలకు పైగా ఉన్నాయంటూ పత్రికల్లో వచ్చిన కథనం అవాస్తవమని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. ఈడీ అటాచ్ చేసిన భూముల్లో కేవలం 47.22 ఎకరాలు మాత్రమే ప్రతిపాదిత సేకరణలో ఉన్నాయని తెలిపారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు.