హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా వాసికి కాళోజి నంది అవార్డు

SRPT: హుజూర్‌నగర్‌కు చెందిన న్యాయవాది, నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోనీ ప్రతిష్టాత్మక కాళోజి నంది అవార్డు అందుకున్నారు. కాళోజీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేశారు. జూనియర్ న్యాయవాదిగా ప్రతిభ, వృత్తిపట్ల అంకితభావాన్ని గుర్తించి సోనీని ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.