హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైకు అదుపుతప్పి వ్యక్తికి గాయాలు

KNR: కేశవపట్నం ఫ్లైఓవర్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం ఉదయం బైక్ అదుపుతప్పి కరీంనగర్‌కు చెందిన సాయికుమార్ గాయపడ్డారు. హుజురాబాద్లో వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎడమచేయి చిటికెన వేలు నుజ్జునుజ్జు కాగా, స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఈఎంటీ సతీష్ రెడ్డి, పైలట్ గోపీకృష్ణ అక్కడికి చేరుకున్నారు.