VKB: బంట్వారం మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణం నిర్వహణ లేక నిరుపయోగంగా మారింది. గ్రామానికి దూరంగా ఉండటంతో క్రీడాకారులు ప్రాంగణాన్ని వినియోగించుకోవడం లేదు. దీంతో క్రీడా ప్రాంగణం మద్యం సేవించే వారికి అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ప్రాంగణాన్ని శుభ్రపరిచి, క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
క్రీడా ప్రాంగణం.. మందుబాబులకు అడ్డా


