హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు

NRPT: మరికల్‌లో దళితులను కించపరిచేలా వ్యవహరించిన బీఆర్‌ఎస్‌ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు వెళ్లిన దళితులు నడిచిన నేలను పసుపు నీటితో శుద్ధి చేశారని ఆరోపించారు. దళిత వ్యతిరేకులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చెన్నయ్య పాల్గొన్నారు.