హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాఫిక్ ఇబ్బంది కలిగించొద్దు: సీఐ

KMM: ఖమ్మం అర్బన్‌ సీఐ భానుప్రకాష్‌ ఆధ్వర్యంలో గణేష్‌ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. మండపాల ఏర్పాటులో డీజేలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు.  ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.