హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ ఉత్సవాలపై అధికారుల సమన్వయ భేటీ

ASF: గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు కెరమెరి పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ రాజు మండపాల నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. గణేష్ పోర్టల్‌లో మండపాల వివరాల నమోదు, సీసీ కెమెరాలు, విద్యుత్, ఫైర్ సేఫ్టీ, ట్రాఫిక్, నిమజ్జన రూట్, జియోట్యాగింగ్‌పై అవగాహన కల్పించారు. డీజేలకు అనుమతి లేదని, రాత్రి 10 గంటల్లోపు సౌండ్ సిస్టమ్ నిలిపివేయాలన్నారు.