హైదరాబాద్: 28°C
తెలంగాణ

కిరోసిన్ పోసుకుని వివాహిత ఆత్మహత్యాయత్నం

ADB: ఆదిలాబాద్‌లోని మహాలక్ష్మివాడకు చెందిన ఓ వివాహిత గురువారం ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గమనించిన స్థానికులు 108 వాహనంలో రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.