NLG: చిట్యాల మండలం ఉరుమడ్లలో శ్రీ రేణుక ఎల్లమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్ల బోనాల పండుగను గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు అమ్మవార్లకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని భక్తులు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
అమ్మవార్లకు బోనాలు సమర్పణ


