హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీజే పెడితే కఠిన చర్యలు: ఎస్సై

MDK: నిజాంపేటలో వినాయక చవితి వేడుకలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్సై రాజేష్ కోరారు. పోలీస్ స్టేషన్లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండపాల వద్ద డీజే సౌండ్స్ పూర్తిగా నిషేధమని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పండుగ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని పెద్దలు, నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు.