CTR: పుంగనూరు పురపాలక సంఘము 2వ సాధారణ ఎన్నికలు 2026 నకు సంబందించిన ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి విడుదల చేశారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో జాబితాలు ప్రచురించారు. 36 వార్డులకు గాను 71 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు చెప్పారు. అభ్యంతరాలు ఉంటే రేపు సాయంత్రం 4 గంటలలోపు లిఖితపూర్వకంగా అందివ్వాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరు పురపాలక పోలింగ్ కేంద్రాల జాబిత విడుదల


