హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

CTR: విజయపురం మండలం క్రీడాపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో గురువారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గాదిరాజు సురళికి ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా ఎంపికైన సురళిని 31 సంవత్సరాలుగా విద్యారంగంలో విశిష్ట సేవలు అందించినందుకు తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు.