హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈతవనాలకు భూములు కేటాయించాలని వినతి

NZB: డొంకేశ్వర్ మండలంలోని 13 గ్రామాల గౌడ కులస్తులకు ప్రభుత్వ భూములు గుర్తించి ఈతవనాల ఏర్పాటుకు ఈత మొక్కలు, బోరు మోటారు మంజూరు చేయాలని కోరుతూ గౌడ సంఘం నాయకులు ఈరోజు తహసీల్దార్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గంగుల బాపూరావు, మండల గౌడ సంఘం అధ్యక్షుడు రాజు గౌడ్, మాజీ సర్పంచ్ దశ గౌడ్, దత్తాపూర్ నారా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.