హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దీన్నేపాడులో బోర్ వైర్ల చోరీ..!

అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లె మండలం దీన్నేపాడు గ్రామంలో రైతు షేక్ మహ్మద్ భాష పొలంలో బోర్లకు సంబంధించిన వైర్లు మరోసారి చోరీకి గురయ్యాయి. గతంలోనూ మూడు బోర్ల వైర్లు చోరీ చేసినట్లు బాధితుడు తెలిపారు. తాజాగా మళ్లీ వైర్లు చోరీ కావడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి చోరీలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.