SRD: సంగారెడ్డిలో విద్యా రంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ PDSU ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డిలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఐటీఐ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో సమర్పించారు.
తెలంగాణ
VIDEO: 'విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి'


