విశాఖ ఎండాడ రిజర్వాయర్ సమీపంలోని లక్ష్మి వానిపాలెంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. కొద్దిరోజులుగా నీరు సరఫరా కాకపోవడంతో మహిళలు ఇవాళ ఖాళీ బిందెలతో వాటర్ సప్లై కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులను నిలదీసి వాగ్వాదానికి దిగారు. నీరు లేక వంటలు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'తాగునీటి కోసం మహిళల ఆందోళన'


