హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు కార్లు ఢీ.. వ్యక్తికి గాయాలు

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని హైవేపై లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో ఇవాళ రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే హైవే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.