హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కప్పలను ఊరేగించిన గ్రామస్తులు

AKP: మునగపాక మండలం యాదగిరిపాలెంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ గ్రామస్థులు వరుణదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కప్పలకు పసుపు, కుంకుమతో పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి గ్రామ పురవీధుల్లో కప్ప కప్ప నీలాలు అంటూ ఊరేగించారు. వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా పండాలంటు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.