హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోషకాహార లోపం రాకుండా చూడాలి

AKP: గర్భిణీలు బాలింతలు చిన్నారులలో పోషకాహారం లోపం రాకుండా అంగన్వాడీ కార్యకర్తలు చూడాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ హైమావతి సూచించారు. ఇవాళ కోటవురట్ల శివారు అంగన్వాడీ -1 కేంద్రంలో పోషణ మాసోత్సవాలను నిర్వహించారు. దీనిలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సూపర్వైజర్ మాట్లాడుతూ.. ఆకుకూరలు కాయగూరలు తీసుకోవాలన్నారు.