హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముప్పాళ్ల పీఎస్‌లో ఎస్సై కీలక హెచ్చరికలు

PLD: వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ‘ఆన్‌లైన్ సింగిల్ విండో’ ద్వారా ముందస్తు అనుమతి తప్పనిసరి అని ముప్పాళ్ల ఎస్‌ఐ అనిల్ కుమార్ స్పష్టం చేశారు. మండలం పరిధిలో డీజేలపై పూర్తి నిషేధం విధించారు. కమిటీ సభ్యులందరూ పోలీస్ స్టేషన్‌లో బైండోవర్ కావాలని, శాంతిభద్రతల పరిరక్షణ నిర్వాహకులదేనని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.