హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ ఉపాధ్యాయినికి ఎమ్మెల్యే సత్కారం

కృష్ణా: బహుముఖ ప్రజ్ఞాశాలి ఉమా సరస్వతి ప్రశంసనీయురాలు అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చల్లపల్లి మండలం పురిటిగడ్డ జడ్పీ హైస్కూల్ ప్లస్ అధ్యాపకురాలు ఓలేటి ఉమా సరస్వతి గురువారం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సత్కారం అందుకున్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉమా సరస్వతి ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు సాధించగా ఆమెను సత్కరించారు.