హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో నేషనల్ గ్రీన్ కోర్ కార్యక్రమం

NTR: పెనుగంచిప్రోలులోని శ్రీ స్వామి పుల్లయ్య మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం నేషనల్ గ్రీన్ కోర్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఎంఈవో డి. రవీందర్, హెచ్ఎం నక్కా బాబురావు మొక్కలు నాటి, పచ్చదనమే పుడమికి శ్రీరామరక్ష అని అన్నారు. భౌగోళిక వెచ్చదనం వలన వచ్చే వైపరీత్యాలను ఎదుర్కోవడానికి మొక్కలు నాటడం అత్యవసరమని వారు నొక్కి చెప్పారు.