హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్

ATP: ఈనెల 12వ తేదీ రెండవ శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు అనంతపురం జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ జడ్జి జస్టిస్ ఈ. భీమారావు గురువారం తెలిపారు. ప్రజలు, కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని స్టేషన్ల పరిధిలోని రాజీపడదగ్గ కేసులను గుర్తించి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.