హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అదుపు తప్పి దూసుకెళ్లిన కారు..!

ELR: కుక్కునూరు మండలం మారేడుబాక గ్రామ సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. అశ్వరావుపేట నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న కారు మారేడుబాక గ్రామ సమీపంలోని అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోతిలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. వారు మద్యం సేవించి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.