హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాలికపై అత్యాచారం.. చాలా చిన్న విషయం అని మాట్లాడుతున్నారు'

ATP: పట్టణంలోని ట్రెల్లీస్ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. టాయిలెట్‌కు వెళ్లిన రెండో తరగతి విద్యార్థినిపై వాచ్‌మెన్ అత్యాచారానికి యత్నించాడు. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇది చాలా చిన్న విషయమని మాట్లాడుతున్నారని, ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొంది. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని తెలిపింది.