హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏసీబీ దాడుల్లో వార్డు కార్యదర్శి పట్టివేత..!

విజయవాడలోని రామలింగేశ్వరనగర్ వార్డు సచివాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కాలేజీ ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తు పరిశీలన కోసం రూ.7,000 లంచం డిమాండ్ చేసిన వార్డు సంక్షేమ కార్యదర్శి సాంబశివరావును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడు పాండ్రాజు నాగదుర్గా రావు ఫిర్యాదుతో డీఎస్పీ బి.వి. సుబ్బారావు బృందం ఈ ట్రాప్ నిర్వహించింది.