హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: చిన్న ఓగిరాలలో ఇంట్లో చోరీ..!

చిన్న ఓగిరాల గ్రామంలో ఓలేటి దుర్గారావు ఇంట్లో చోరీ జరిగింది. 20 రోజుల క్రితం కుటుంబంతో బెంగళూరుకు వెళ్లి తిరిగి వచ్చేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. కేజీ వెండి, 10 గ్రాముల బంగారం, రూ.10 వేల నగదు పోయినట్లు బాధితుడు తెలిపారు. పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.