హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రోన్లతో పోలీసుల స్పెషల్ డ్రైవ్..!

అన్నమయ్య: ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో రాయచోటి, మదనపల్లెలో డ్రోన్లతో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న విద్యార్థులను గుర్తించి అవగాహన కల్పించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు, యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల భద్రత కోసం ప్రతిరోజూ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.