GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గంలో గురువారం ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ తనిఖీలు నిర్వహించారు. గుంటూరు రూరల్ మండలం ఏటుకూరులోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ప్రత్తిపాడు మండలంలో పర్యటించారు. రెండు అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహణపై పరిశీలన చేపట్టారు. నిబంధనల అమలులో లోపాలపై సంబంధిత కేంద్రాలకు మెమోలు జారీ చేసినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫుడ్ కమిషన్ తనిఖీలు


