హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మద్యం దుకాణాలకు అడ్డు ఏది'

KDP: వేంపల్లెలో నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజామునే మద్యం దుకాణాలు తేరిచి విక్రయిస్తున్నారని పులివెందుల కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ధ్రువకుమారెడ్డి ఆరోపించారు. ఉదయం 10 గంటలకు దుకాణాలు తెరవాల్సి ఉండగా.. కొన్ని దుకాణాలు ఉదయం 5 గంటలకే తెరిచి మద్యం విక్రయిస్తున్నాయని అన్నారు. ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి కొనసాగుతోందని విమర్శించారు.