హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చేనేత పింఛన్‌పై జీవోను రద్దు చేయాలి'

KDP: చేనేత పింఛన్‌కు సంబంధించి 2019లో జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని జాతీయ చేనేత ఐక్య వేదిక అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున డిమాండ్ చేశారు. గురువారం కడపలో ఆయన మాట్లాడుతూ.. ‘నేతన్న సేవలో’ పథకం లబ్ధిదారుల జాబితా ప్రకారం పింఛన్ ఇవ్వాలని కోరారు. 24 గంటల్లో జీవో ఉపసంహరించకపోతే సెప్టెంబర్ 11న కడప కొత్త కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.