హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమతుల్లేకుండా మొక్కజొన్నల తరలింపు

GDWL: కొండపల్లి రోడ్డులోని కేంద్ర ప్రభుత్వ గ్రామీణ గిడ్డంగుల నుంచి ఎలాంటి అనుమతులు, టెండర్లు లేకుండా మొక్కజొన్నలను తరలిస్తున్న రెండు డీసీఎం వాహనాలను ఇవాళ స్థానిక లారీ డ్రైవర్లు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వలు తరలించడంపై గోదాం ఇన్‌ఛార్జి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపలని అంటున్నారు.