NRML: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ వైపు వెళ్తున్న లారీ, కారు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు నిర్మల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా సమాచారం.
తెలంగాణ
లారీ, కారు ఢీకొని వ్యక్తి స్పాట్‌డెడ్


