హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సరైన వర్షాలు లేక ఎండుతున్న పొలాలు!

తూ.గో: గోకవరం మండలంలో అరకొర వర్షాలకు వేసిన వరి నాట్లు వర్షాలు లేక ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూరంపాలెం ప్రాజెక్టులో సాగునీరు లేకపోవడంతో పంట ఎండుతోందని వాపోతున్నారు. గత ఏడాది కంటే ఈసారి పెట్టుబడి ఖర్చులు పెరిగాయని, వర్షాలు లేక పంట చేతికి రావడం కష్టమని రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.